నాగాయలంకలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్

నాగాయలంకలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్

కృష్ణా: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం నాగాయలంక ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు అర్జీలు స్వీకరించారు.