VIDEO: మాధవధార ఫారెస్ట్ కొండలో అగ్ని ప్రమాదం
VSP: మాధవధార ఫారెస్ట్ కొండలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో శుక్రవారం మధ్యాహ్నం దట్టమైన పొగ, భారీ మంటలు ఎగసిపడ్డాయి. అటుగా వెళుతున్న గోపాలపట్నం నివాసి వీఆర్ రవి గమనించి వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు.