రక్షణ సంస్థలకు ట్రంప్ సంచలన ఆదేశం
అమెరికాలోని రక్షణ ఆయుధాల తయారీ కంపెనీలతో అధ్యక్షుడు ట్రంప్ కీలక సమావేశం నిర్వహించారు. దేశంలో ఆయుధాల ఉత్పత్తిని 4 రెట్లు పెంచాలని ఆయన కోరారు. ఇప్పటికే తమ వద్ద అపరిమితంగా యుద్ధ సామాగ్రి ఉందని.. వెనిజులా, ఇరాన్‌పై ప్రస్తుతం వాటినే ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొత్త ఆయుధ ఫ్యాక్టరీలను కూడా తక్షణమే ప్రారంభించాలని ట్రంప్ ఈ సందర్భంగా సూచించారు.