ముంపునకు గురైన పంటలను పరిశీలించిన: ఏఈవో

KMR: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పిట్లం మండలం చిన్న కొడపల్ శివారులోని ఎల్లయ్య చెరువు ఆయకట్టులో ముంపునకు గురైన పంటలను ఏఈవో సురేష్ పరిశీలించారు. యువ రైతులతో కలిసి పొలాల్లో పర్యటించారు. వరదలకు నష్టపోయిన పత్తి, సోయా పంటలను క్షుణ్ణంగా పరిశీలించారు. పంట నష్టానికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.