'బాలికలకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం నేరం'

KKD: తుని పట్టణంలోని అర్బన్ ఐసిడిఎస్ కార్యాలయంలో ఇవాళ కిషోర్ వికాస్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా PO శ్రీలత మాట్లాడుతూ.. బాలికలకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం చట్ట రీత్యా నేరమని పేర్కొన్నారు. 14 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలకు 'బాల్య వివాహాలు వద్దు చదువే ముద్దు' అనే నినాదంతో ఈ వేసవి సెలవులలో ప్రత్యేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.