రేవంత్ రెడ్డిని ఆశీర్వదించిన అర్చకులు
TG: సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా యాదగిరి గుట్ట ఆలయ అర్చకులు ఆయనను ఆశీర్వదించారు. జూబ్లీహిల్స్‌లోని ఇంటికి వచ్చిన అర్చకులు.. రేవంత్ రెడ్డికి వేదమంత్రోచ్ఛరణలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఫొటో, యాదగిరి గుట్ట ఆలయ ప్రసాదాన్ని సీఎంకు అందించారు.