పేకాట శిబిరంపై దాడి.. ఏడుగురు నిందితులు అరెస్ట్
PLD: దాచేపల్లి మండలం కొత్తూరు, సారంగపల్లి అగ్రహారం గ్రామ పొలాల్లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్సై పాపారావు, సిబ్బంది మెరుపు దాడులు నిర్వహించి నిందితులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మండలంలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, నిరంతరం నిఘా ఉంటుందని ఆయన హెచ్చరించారు.