VIDEO: 'అంబేద్కర్ ఆశయాలు యువతకు స్ఫూర్తి'
SKLM: అంబేద్కర్ ఆశయాలు యువతకి స్ఫూర్తిని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యాయవేత్తగా ఆర్థికవేత్తగా రాజ్యాంగ రచయితగా సామాజిక సంస్కర్తగా ఆయన సేవలు మరుగు లేనివని అన్నారు. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ పోరాటం చిరస్మరణీయమని అన్నారు.