VIDEO: హయత్ నగర్‌లో హైడ్రా కూల్చివేతలు
RR: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమాములలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సర్వే నెంబర్ 454లో ప్లాట్లను కబ్జా చేసి నిర్మాణం చేపట్టడంతో శ్రీకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హైడ్రాకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. కబ్జాదారుల నుంచి దాదాపు రూ.15 కోట్ల స్థలాన్ని కాపాడినందుకుగాను స్థానికులు హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు.