'పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేపట్టాలి'

NLG: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద జిల్లాలో 3500 మందికి లబ్ధి చేకూర్చవచ్చని, ఇందుకుగాను అర్హులైన లబ్ధిదారులందరూ దరఖాస్తు చేసుకునే విధంగా విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.