పొల్యూషన్‌పై సుప్రీం సీరియస్.. నేడు విచారణ
దేశ రాజధాని ఢిల్లీ సహా పలు నగరాల్లో వాయు కాలుష్యంపై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇప్పటికే కాలుష్యంపై కోర్టు సీరియస్‌గా ఉండగా.. ఇవాళ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజధానిలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతుండటంపై కోర్టు ఫోకస్ పెట్టింది.