రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు

ELR: నూజివీడు పట్టణంలోని ఎంఆర్ అప్పారావు కాలనీ నుంచి పెయింట్ కార్మికుడు మాపర్తి మహేష్ (21) మంగళవారం నూజివీడు వైపు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో పెయింట్ కార్మికుడు మహేష్ కాలు విరిగింది. స్థానికులు గమనించి ఆటోలో నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.