చట్టాన్ని అతిక్రమించే చర్యలు తప్పవు: ఎస్పీ
SRD: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం సంగారెడ్డి బస్ డిపోను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమ్మె కాలంలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలగకుండా ముందస్తు సమాచారంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.