మార్కాపురం జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన సోమయ్య
మార్కాపురం జిల్లాలోని ప్రెస్ క్లబ్‌లో జరిగిన జిల్లా ప్లానరీ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి సోమయ్య జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సయ్యద్ హనీ, వెంకటేశ్వర్లు, కేశవరావు, మాల్యాద్రి, రఫీ, బాల నాగయ్యలను జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు.