పత్రికేయులకు ఉచిత వైద్య శిబిరం
E.G: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పాత్రికేయులు,వారి కుటుంబ సభ్యుల కోసం మార్చి 26న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఉదయం 8:30 గంటలకు నమోదు ప్రారంభమవుతుంది. అనంతరం నిపుణులైన వైద్యులతో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. పాత్రికేయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.