పంట బోదె ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతి

W.G: శేరేపాలెం గ్రామంలో పంట బోదె అధ్వాన్నంగా ఉందని, దానిని ప్రక్షాళన చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని. కొప్పరు నీటి సంఘం ఛైర్మన్ కత్తుల శ్రీనివాసు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ను కోరారు. శుక్రవారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేకు రైతులు తమ సమస్యను వివరించి, బోదె ప్రక్షాళనకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు అధికారులు పాల్గొన్నారు.