గుంటూరు ఉత్తమమైన అధికారులను కలిగి ఉంది : ఎస్పీ

గుంటూరు ఉత్తమమైన అధికారులను కలిగి ఉంది : ఎస్పీ

గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం పాత ఎస్పీ సతీశ్ కుమార్‌‌కు వీడ్కోలు పలికారు. పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించి, అధికారులు జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ఉత్తమమైన అధికారులను కలిగి ఉందని అన్నారు. 14 నెలల కాలంలో తాను ఎన్నో ఒడిదుడుకులు చూసి చాలా నేర్చుకున్నానని చెప్పారు.