VIDEO: మద్యం మత్తులో యువకులు హల్‌చల్
అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గురువారం రాత్రి కొందరు యువకులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. ఓ పాల డైరీ వద్ద జరిగిన ఈ ఘటనలో, అక్కడి సిబ్బంది, యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చిన్నపాటి వివాదం కాస్త పెద్దదై ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.