జాతీయ రహదారి పై వ్యాన్ బోల్తా

SKLM: నందిగాం మండలం సుభద్రాపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి పలాస వైపు జీడి పిక్కల లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో వాహనాన్ని బయటకు తీశారు.