VIDEO: పోలీస్ సేవలు అభినందనీయం: జడ్జి
NRML: విడిపోయిన జంటలను భరోసా సెంటర్ ద్వారా మళ్లీ ఒకటిగా చేస్తున్న పోలీసు సేవలు అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచే సిన ప్రత్యేక కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడిపోయిన జంటలు కలవడంతో ఇరు కుటుంబాలు సంతోషంగా ఉంటాయని, జంటలను కలపడంలో ఎస్పీ జానకి షర్మిల కృషి అనిర్వచనీయమని కొనియాడారు.