గాంధీ జయంతి.. విచ్చలవిడిగా బెల్టు షాపులు

గాంధీ జయంతి.. విచ్చలవిడిగా బెల్టు షాపులు

GNTR: తుళ్లూరు మండలంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని ప్రజలు, మహిళలు అంటున్నారు. స్థానిక షాప్ నిర్వాహకులతో బెల్టు షాపులు నిర్వాహకులు కుమ్మక్కై విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ జయంతి రోజు తుళ్లూరు, దొండపాడు,బోరుపాలెం, వడ్డమాను, అనంతవరం గ్రామాలలో మద్యం అమ్మకాలు నిమ్మకునీరెత్తినట్లు ఉన్నాయని విమర్శిస్తున్నారు.