మాడుగుల పల్లిలో రేపు ప్రత్యేక పశు వైద్య శిబిరం
NLG: మాడుగులపల్లి ప్రాథమిక పశు వైద్యశాలలో మంగళవారం ప్రత్యేక పశు వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మండల పశు వైద్యాధికారి వినయ్ కుమార్ సోమవారం తెలిపారు. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని పశుపోషకులకు ఆయన సూచించారు. మండల పరిధిలోని గ్రామాల పశుపోషకులందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.