బాలికల విద్యాలయంలో కంప్యూటర్ ల్యాబ్‌ ప్రారంభం

బాలికల విద్యాలయంలో కంప్యూటర్ ల్యాబ్‌ ప్రారంభం

ATP: కనేకల్లు మండలం కొత్తపల్లిలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.41.60 లక్షల వ్యయంతో నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ రూమ్‌ను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు గురువారం ప్రారంభించారు. గ్రామీణ బాలికల భవిష్యత్తును బలోపేతం చేయడానికి, డిజిటల్ లెర్నింగ్‌ను అందించడానికి ఈ సదుపాయాలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.