వరికుంటపాడు ఇన్‌ఛార్జ్ ఏఈగా మనోహర్ బాధ్యతలు

NLR: వరికుంటపాడు మండలం పంచాయతీరాజ్ ఇన్‌ఛార్జ్ ఏఈగా మనోహర్ బాధ్యతలు చేపట్టారు. ఈయన వింజమూరు పట్టణ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వరికుంటపాడు పీఆర్ ఏఈగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సంబంధిత శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన డిప్యూటీ ఎంపీడీవో నాగూర్ వలికి రిపోర్ట్ చేశారు.