స్పీకర్‌కు లేఖ రాసిన ఎమ్మెల్యే హరీష్

ASF: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మంగళవారం సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు లేఖ రాశారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటిస్తూ విడుదల చేసిన జీవో నెం.49ను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. ఈ జీవోతో ప్రజలకు నష్టం ఉందని, పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.