పెట్రోల్ కొరతతో వాహనదారుల ఇబ్బందులు

పెట్రోల్ కొరతతో వాహనదారుల ఇబ్బందులు

NTR: కంచికచర్లలో పెట్రోల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని పలు పెట్రోల్ బంకుల్లో ఇంధనం లేకపోవడంతో, భారత్ పెట్రోలియం బంకు వద్ద మాత్రమే ఆయిల్ లభ్యమవుతోంది. దీంతో వాహనదారులు భారీగా బారులు తీరుతున్నారు. ఇదే సమయంలో బంకు సిబ్బంది వాహనదారులతో అనుచితంగా ప్రవర్తిస్తూ, ఆయిల్ లేదని వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారని పలువురు తెలిపారు.