ప్రారంభమైన బ్రిడ్జి నిర్మాణ పనులు

ప్రారంభమైన బ్రిడ్జి నిర్మాణ పనులు

MBNR: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజాపూర్ మండల ప్రజలకు శుభవార్త అనే చెప్పవచ్చు. గత కొన్ని ఏళ్లుగా జాతీయ రహదారి ముఖ్య కూడలిలో ప్రమాదాలు జరిగి ఎందరో మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు సోమవారం బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. రాజాపూర్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల ప్రజలు, ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.