మేడ్చల్‌లో క్షుద్ర పూజల కలకలం

మేడ్చల్‌లో క్షుద్ర పూజల కలకలం

MDCL: కేఎల్ఆర్ వెంచర్ రోడ్డుపై క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, పిండాలతో నడిరోడ్డుపై పూజలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతుండగా, మేడ్చల్ సీఐ సత్యనారాయణ స్పందించారు. ప్రజలు క్షుద్ర పూజలను నమ్మవద్దని తెలిపారు.