'బెట్టింగ్‌లకు పాల్పడితే కేసులు నమోదు'

'బెట్టింగ్‌లకు పాల్పడితే కేసులు నమోదు'

VZM: IPL సీజన్ నేపథ్యంలో విద్యార్థులు బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని సీఐ షణ్ముఖరావు సోమవారం హెచ్చరించారు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బెట్టింగ్‌లు యువత జీవితాలను నాశనం చేస్తాయని పేర్కొన్నారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడినా లేదా ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని, వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.