నేడు బూర్జ మండలంలో ఎమ్మెల్యే పర్యటన
SKLM: బూర్జ మండలం పెద్దపేట గ్రామంలో బుధవారం ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ పర్యటిస్తారని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదలైంది. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం రెండవ విడత నిధులు విడుదలైన సందర్భంగా రైతులతో ఎమ్మెల్యే ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. ఈ మేరకు స్థానిక రైతులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.