VIDEO: చేనేత సంఘం విలీనానికి వ్యతిరేకంగా నిరసన
KRNL: ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘంను అప్కోలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ నేతలు ఇవాళ నిరసన తెలిపారు. సంఘం వ్యవస్థాపకులు పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి YCP జిల్లా చేనేత హస్తకళ విభాగపు అధ్యక్షులు మల్లి వినతిపత్రం సమర్పిస్తూ తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు.