అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
కడప: పోరుమామిళ్ల మండలం తిరువెంగలాపురంలో సుజాత అనే వివాహిత ఆదివారం అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు సమాచారం. భర్త, అత్తమామలే చంపారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే, మృతురాలికి మెడపై గాయం ఉండడం, భర్త గురుశేఖర్ పరారీ కావడంతో మరింతగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.