గుంటూరు మున్సిపాలిటీకి రూ. 6 కోట్ల ఆదాయం

గుంటూరు నగరపాలక సంస్థ చరిత్రలో రికార్డు నెలకొంది. ఈ నెల 18 నుంచి 20 వరకు కొల్లి శారద హోల్‌సేల్ మార్కెట్లో జరిగిన షాపుల బహిరంగ వేలంలో ఎన్నడూ లేని విధంగా 81 షాప్‌ల ద్వారా నెలకు రూ. 50 లక్షలు అంటే ఏడాదికి రూ. 6 కోట్లు GMCకి అద్దెలు వచ్చేలా వేలం జరిగింది. గతంలో నెలకు రూ. 6.80 లక్షలు మాత్రమే ఉండే ఆదాయం ఇప్పుడు భారీగా పెరిగింది.