నేడు కాకినాడలో ఉచిత వైద్య శిబిరం

KKD: గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పాత బస్టాండ్ దగ్గర శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు జరిగే ఈ శిబిరంలో అన్ని వ్యాధులకు ఉచిత చికిత్సతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని సూచించారు.