'కూటమి ప్రభుత్వంలోనే పేదల కల నెరవేరింది'
CTR: పేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. ఇందులో భాగంగా చిత్తూరు మండలంలోని తిమ్మసముద్రంలో బుధవారం నిర్వహించిన గృహప్రవేశాల కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్‌తో కలిసి వారు పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమాన్ని వర్చువల్‌గా తిలకించారు.