డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్
KRNL: డిసెంబర్ 13న పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జడ్జి టి. జ్యోష్ణ దేవి తెలిపారు. రాజీకి వీలున్న పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించుకునేందుకు ఇది మంచి అవకాశం కావడంతో, కక్షిదారులు సామరస్యంతో చర్చించి ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.