పెందుర్తిలో పంచాయతీల పరిస్థితి ఏంటి..?
VSP: పెందుర్తి మండలంలోని కొన్ని పంచాయతీలు ఇప్పటికే జీవీఎంసీలో కలిశాయి. మిగిలిన 15 గ్రామాల విలీనంపై స్థానికుల్లో సందేహం నెలకొంది. ఈనెల 17తో జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. కొత్త పాలకవర్గం కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జీవీఎంసీ ఎన్నికలా? పంచాయతీ ఎన్నికలా? అనే విషయంపై గందరగోళం నెలకొంది. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.