బీజేపీలో చేరిన ఇప్పల తండా యువకులు
WGL: నర్సంపేట మండల పరిధిలో ఇప్పల తండాకు చెందిన యువకులు బీజేపీ పార్టీలో చేరారు. పార్టీ నాయకుడు రానా ప్రతాప్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరగా, రానా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.