'మునగపాకను అనకాపల్లి డివిజన్లో కొనసాగించాలి'
AKP: మునగపాక మండలాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మునగపాకలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం నాగవరం, మల్లవరం, గొల్లల పాలెం, వాడ్రాపల్లికి చెందిన వైసీపీ నేతలు దీక్షలు చేపట్టారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు వచ్చి వీరికి సంఘీభావం తెలియచేశారు. నక్కపల్లి రెవెన్యూ డివిజన్లో మునగపాక మండలాన్ని కలపవద్దన్నారు.