VIDEO: భీమేశ్వరాలయంలో భక్తుల సందడి

SRCL: వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రాజన్నను దర్శించుకున్న భక్తులు, బద్ది పోచమ్మ తల్లితో పాటు భీమన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అర్చకులు వేద పండితులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవుదిన సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దేవాలయాలు దర్శించుకున్నారు.