VIDEO: 'పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు'
WGL: పర్వతగిరి మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై ఇవాళ డీసీపీ అంకిత్ కుమార్ సందర్శించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికబద్ధంగా పనిచేయాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలు, సున్నితమైన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.