ఇండి కూటమి అభ్యర్థి ఈయనే?

కాసేపట్లో ఇండి కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దక్షిణాది నుంచే అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే DMK తిరుచ్చి శివ పేరును ప్రతిపాదించింది. ఇండి కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న DMK నిర్ణయమే ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.