పులివెందుల సీఐగా శ్రీరామ్ నియామకం
కడప: పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐగా శ్రీరామ్‌ను నియమిస్తూ కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ సీతారామిరెడ్డిని పులివెందుల రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కాగా ఇటీవలే ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ 45 రోజులు గడవకముందే సీఐ శ్రీరామ్ బదిలీ అయిన విషయం తెలిసిందే.