CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
CTR: పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పంపిణీ చేశారు. కసింమిట్టకు చెందిన చామంతికి రూ. 37 వేలు, పుదుపేటకు చెందిన బాలమురుగన్‌కు రూ. 95 వేలు, ధనపాల్‌కు రూ.15 వేలు, నాగరాణికి రూ .41 వేలు, చింతల పట్టెడకు చెందిన సంగీతకు రూ. 95 వేలు, లక్ష్మికి రూ.10 వేలు అందించారు. కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నదని ఆయన తెలిపారు.