పేటీఎం నష్టం @ రూ.545 కోట్లు

పేటీఎం నష్టం @ రూ.545 కోట్లు

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.545 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.551 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం కూడా 15.7 శాతం క్షీణించి రూ.1911.5 కోట్లుగా నమోదైంది.