'ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం'
SDPT: మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో హనుమాన్ ఆలయ నూతన కమిటీని ఘనంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పార్వతి కనకరాజ్, ప్రధాన కార్యదర్శిగా పన్యాల సాయి రెడ్డి, ఉపాధ్యక్షులుగా అఖిల్ గౌడ్, సత్యరాములు బాధ్యతలు స్వీకరించారు. కోశాధికారిగా మహేందర్ గౌడ్, కార్యదర్శిగా కోటేశ్వర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గ్రామస్థుల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.