దామరమడుగులో సీసీ కెమెరా ఏర్పాటు
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో సీసీ కెమెరా ఏర్పాటుకు దాతలు ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన కొండ చంద్రమోహన్ రెడ్డి రూ.12 లక్షలతో గ్రామం, స్థానిక జూనియర్ కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస రావు ఆయనను అభినందించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఈసీసీ క్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.