VIDEO: కొండను ఢీకొట్టిన లారీ
KDP: పోరుమామిళ్ళ(M) టేకురుపేట గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. కొండ మొదటి మలుపు వద్ద గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవరుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి వెంటనే డ్రైవరును సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.