పాఠశాలల్లో ప్రవేశ పరీక్షలు నిషేధం: డీఈఓ
ATP: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు పాఠశాలల్లో ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదని డీఈఓ ప్రసాద్ బాబు తెలిపారు. స్క్రీనింగ్, టాలెంట్ టెస్టులు, ఉపకార వేతనాల పరీక్షలను నిషేధించినట్లు చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.