పొగాకు గోదామునును పరిశీలించిన కలెక్టర్

BPT: జిల్లా కలెక్టర్ వెంకట మురళి మంగళవారం కర్లపాలెంలోని ఎఫ్‌సీఐ గోదామును సందర్శించారు. అక్కడ నిల్వ ఉంచిన పొగాకు నాణ్యతను పరిశీలించి, రైతులు, అధికారులతో మాట్లాడారు. పొగాకు కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు.